పొన్నాల కాలువలో మహిళ మృతదేహ భాగాల కోసం గాలింపు

3594చూసినవారు
పొన్నాల కాలువలో మహిళ మృతదేహ భాగాల కోసం గాలింపు
కర్లపాలెం మండలం నర్రావారిపాలెంలోని పొన్నాల కాలువలో గుర్తుతెలియని మహిళ మృతదేహానికి సంబంధించిన భాగాలను వెలికితీయడానికి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బుధవారం సీఐ హరికృష్ణ ఆధ్వర్యంలో, కర్లపాలెం ఎస్సై రవీంద్ర, చందోలు ఎస్సై వెంకట శివ కుమార్, వెదుళ్ళపల్లి ఎస్సై భాగ్యరాజ్ లు బోట్ సహాయంతో పొన్నాల కాలువ ఇంకెన వద్ద నుంచి సముద్రం వరకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్