42 మంది బెట్టింగ్ రాయుళ్ల పై కేసు నమోదు ఎస్పీ

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ఉమామహేశ్వర్ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా పరిధిలోని ఈపూరుపాలెం, వేటపాలెం, చీరాల 2వ పట్టణ, చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ ల పరిధిలో బెట్టింగ్ రాయుళ్లపై మెగా ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 42 మందిపై కేసులు నమోదు చేసి 25 మొబైల్ ఫోన్ లు, రూ. 51,400/- నగదు, ఒక కారు, ఒక బైక్ ను సీజ్ చేశామన్నారు. క్రికెట్ బెట్టింగ్ లు నిర్వహించినా, పాల్పడిన, ప్రోత్సహించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ హెచ్చరించారు.
