బాపట్ల జిల్లా కొల్లూరు బస్టాండ్ సెంటర్‌లో గురువారం
వైసీపీ,
టీడీపీ శ్రేణుల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న
వైసీపీ నాయకులను
టీడీపీ మండల కన్వీనర్ మైనేని మురళీకృష్ణ ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తూ వారిని అక్కడి నుంచి పంపించారు.