జనగణన తొలి దశ ప్రక్రియను ఈనెల 30లోగా కచ్చితంగా పూర్తి చేయాలని ఏపీ జనగణన ఆపరేషన్ ప్రధాన అధికారి ఎస్.ఎస్. రావత్ ఆదేశించారు. మంగళవారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తూ, జనగణన ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ వి. వినోద్ కుమార్ పాల్గొన్నారు.