బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామానికి చెందిన ధనలక్ష్మి అనే మహిళ 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 51 సెంట్ల భూమికి సంబంధించిన అగ్రిమెంట్ పత్రాలను అదే గ్రామానికి చెందిన బొత్తుల విల్సన్ దొంగిలించి, దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అనంతరం, ధనలక్ష్మి బంధువైన మొవ్వ గాంధీ రాజుపై మంగళవారం దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న గాంధీ రాజును బాపట్ల జిల్లా జై భీమ్రావు పార్టీ అధ్యక్షుడు పర్రె కోటయ్య పరామర్శించి, బాధితులకు న్యాయం చేయాలని, దోషులను శిక్షించాలని కోరారు.