గురువారం పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామ సచివాలయంలో యానిమేటర్లకు ఉచితంగా సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ ఎండీ అబ్జాల్, బాపట్ల పార్లమెంట్ మైనార్టీ అధ్యక్షుడు ఎండీ కాసిం పాల్గొని సెల్ ఫోన్లను అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో యానిమేటర్లు కీలక పాత్ర పోషించాలని వారు సూచించారు. డీసీ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్, టీడీపీ నాయకులు ఎండీ సాదిక్, బాజీ, సోహెల్, ఏపీఎం చిన్నయ్య, సీసీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.