బాపట్ల జిల్లాలో ఇంధన కొరత లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సోమవారం తెలిపారు. కొండపల్లి నుండి ఇంధన సరఫరా ప్రారంభమైందని, సోమవారం సాయంత్రానికి అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దని, ఎలాంటి అపోహలు నమ్మవద్దని సూచించారు. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సమస్యలుంటే కంట్రోల్ రూమ్ నంబర్ 9493247765కు సమాచారం ఇవ్వాలని కోరారు.