రాష్ట్రంలో పిడుగులు, తీవ్రఎండ: విభిన్న వాతావరణం

8చూసినవారు
రాష్ట్రంలో పిడుగులు, తీవ్రఎండ: విభిన్న వాతావరణం
రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల తీవ్రఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. విదర్భ, తెలంగాణ, రాయలసీమల మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో బుధవారం (03-06-2026) గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42-44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40-42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. రేపు శ్రీకాకుళం 7, విజయనగరం 6, మన్యం 11 మండలాల్లో(24) తీవ్రవడగాల్పులు, 28 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్