భట్టిప్రోలు మండలంలోని పలు గ్రామాలకు చెందిన 8 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి మొత్తం రూ. 3, 83, 506 చెక్కులుగా మంజూరయ్యాయి. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు రిఫరెన్స్ లేఖ ఆధారంగా ఈ మొత్తాన్ని మంజూరు చేశారు. బాధితులకు, కుటుంబ సభ్యులకు శనివారం ఎమ్మెల్యే ఆనందబాబు స్వయంగా చెక్కులు అందజేశారు.