బాపట్ల వ్యాపారులకు హెచ్చరిక..!

9చూసినవారు
బాపట్ల పోస్టాఫీస్ సమీపంలోని ఓ బేకరీలో క్యూఆర్ కోడ్ పనిచేయడం లేదని చెప్పి, కొందరు వ్యక్తులు వస్తువులు కొనుగోలు చేశారు. అనంతరం ఫోన్‌పే నంబర్ తీసుకుని, డబ్బులు పంపినట్లు నకిలీ స్క్రీన్‌షాట్ చూపించి వెళ్లిపోయారు. ఖాతా పరిశీలించగా నగదు జమ కాలేదని తేలడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ఇతర దుకాణాల్లోనూ ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని సమాచారం. వ్యాపారులు నగదు జమ అయినట్లు నిర్ధారించుకున్న తర్వాతే వస్తువులు ఇవ్వాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్