బాపట్లలో ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని, కూలీలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని జిల్లా
వైసీపీ పంచాయతీ రాజ్ అధ్యక్షుడు తోకల కృష్ణమోహన్ కోరారు. సోమవారం కలెక్టరేట్ వద్ద
వైసీపీ నేతలు ధర్నా చేపట్టి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. పథకంలో అవకతవకలు పెరుగుతున్నాయని ఆరోపిస్తూ, కూలీలకు పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.