Jan 24, 2026, 16:01 IST/పెద్దపల్లి
పెద్దపల్లి
అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు
Jan 24, 2026, 16:01 IST
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు శనివారం రాత్రి సుల్తానాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో రూ.15 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సుల్తానాబాద్ అభివృద్ధియే ధ్యేయంగా పక్కా ప్రణాళికలతో నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే రూ.20 కోట్లతో పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.