Jan 20, 2026, 14:01 IST/
ఆ జిల్లాల్లో 6 అర్బన్ ఫారెస్టులు, నిధులు మంజూరు
Jan 20, 2026, 14:01 IST
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 'నగర్ వన్ యోజన' పథకం కింద రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో 6 అర్బన్ ఫారెస్టుల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల అభివృద్ధికి రూ. 8.26 కోట్లు మంజూరు చేసింది. పట్టణాల్లో పచ్చదనాన్ని పెంచే లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ అర్బన్ ఫారెస్టులలో స్థానిక వృక్ష జాతులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలంగాణ అటవీ శాఖ అధికారులు తెలిపారు.