
మిస్టరీగా మారిన వ్యక్తి అదృశ్యం!
పల్నాడు జిల్లా నాదెండ్ల గ్రామానికి చెందిన రాంబాబు (38) ఈ నెల 11వ తేదీన మిర్చి అమ్మి వచ్చిన రూ.30 వేల నగదుతో తిరిగి వస్తున్నట్లు తన భార్య అంకమ్మకు ఫోన్ లో చెప్పారు. అయితే, మూడు రోజులు గడిచినా ఆయన ఇంటికి చేరకపోవడంతో ఆందోళన చెందిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, రాంబాబు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.




































