చిలకలూరిపేటలో ఘనంగా బక్రీద్ వేడుకలు

7చూసినవారు
చిలకలూరిపేటలో ఘనంగా బక్రీద్ వేడుకలు
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక నమాజ్, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నూతన వస్త్రాలు ధరించినవారు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు అందించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్