చికిత్స పొందుతూ బస్సు డ్రైవర్ మృతి

3చూసినవారు
చికిత్స పొందుతూ బస్సు డ్రైవర్ మృతి
విజయవాడ మాచవరానికి చెందిన ప్రైవేటు బస్సు డ్రైవర్ యండ్రాసి శివశంకరబాబు (42) విధి నిర్వహణలో గాయపడి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ నెల 21న తిమ్మాపురం సమీపంలో బస్సు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు గాయపడిన ఆయన గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్