చిలకలూరిపేట: నలుగురు పేకాట రాయుళ్ల అరెస్టు

11చూసినవారు
చిలకలూరిపేట: నలుగురు పేకాట రాయుళ్ల అరెస్టు
చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కావూరి, బొప్పుడి గ్రామాలలో చట్టవిరుద్ధంగా పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 7,300 నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. గ్రామాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ జి. అనిల్ కుమార్ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్