చిలకలూరిపేట: పంట నష్టానికి తక్షణమే పరిహారం ఇవ్వాలి

2293చూసినవారు
చిలకలూరిపేట మండలం అకాల వర్షాలు, తుఫానుల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, వారికి న్యాయమైన నష్టపరిహారం అందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్‌చార్జి విడదల రజిని డిమాండ్ చేశారు. గురువారం ఆమె రైతులను సందర్శించి, దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించారు. రైతులు పండించిన మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతిని, మొలకెత్తిన కంకులను ఆమెకు చూపించారు.