మంగళవారం చిలకలూరిపేట పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో మటన్, చికెన్ దుకాణాలను మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఒక చికెన్ షాపు అత్యంత అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించి, కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణంలో ఈగలు, కీటకాలు అధికంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, గ్లాస్ అద్దాలు ఏర్పాటు చేసి పరిశుభ్రత పాటించాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా శుభ్రత చర్యలు చేపట్టే వరకు షాపును మూసివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.