చిలకలూరిపేటలో ఎన్నికల హోరు

1726చూసినవారు
చిలకలూరిపేటలో ఎన్నికల హోరు
చిలకలూరిపేట మండల పరిధిలోని 20 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. మొత్తం 35,119 మంది ఓటర్లలో 18,193 మంది మహిళలు, 16,925 మంది పురుషులు ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటం విశేషం. ఓటర్ల జాబితాలను గ్రామ సచివాలయాలు, పంచాయతీ కార్యాలయాల్లో పరిశీలనకు అందుబాటులో ఉంచారు. జాబితాలో పొరపాట్లు, మార్పులు లేదా అభ్యంతరాలు ఉంటే వెంటనే తెలియజేయాలని అధికారులు సూచించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్