జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్య ఘటనపై మీడియా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం చిలకలూరిపేటలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా ఏపీ కార్యదర్శి మస్తాన్ వలి మాట్లాడుతూ, జర్నలిస్టును హత్య చేయడం అత్యంత దారుణమని ఖండించారు. అనంతరం తహశీల్దార్ హుస్సేన్‌కు వినతిపత్రం సమర్పించారు. APUWJ రాష్ట్ర నాయకులు భక్తవత్సలం మాట్లాడుతూ, హత్యకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో జర్నలిస్టులపై దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.