పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం జగ్గాపురం చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు
విద్యార్థులు మృతి చెందారు. మృతులు అమానుల్లా (13), అబ్దుల్లా (16)గా గుర్తించారు. చెరువు గట్టున చెప్పులు కనిపించడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి,
విద్యార్థులు చెరువు వద్దకు ఎందుకు వెళ్లారనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు.