చిలకలూరిపేట రూరల్ పోలీస్ పరిధిలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. పసుమర్రు గ్రామంలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని ₹2,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. మానుకొండవారిపాలెం పరిధిలో మరో ఆరుగురిని పట్టుకుని ₹3,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.