చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయంలో చైర్మన్ రఫాని శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సహకారంతో అమృత్ పథకం రెండో విడత పనులను అమలు చేసేందుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. అమృత్ పథకం మొదటి దశలో పట్టణ ప్రజలకు నాలుగు వేల మంచి నీటి కనెక్షన్లు అందించామని, రెండో విడత పనుల కోసం 116 కోట్ల రూపాయలు మంజూరు అయినట్లు ఆయన వెల్లడించారు.