లేగదూడపై వీధి కుక్కల దాడి… రైతుల్లో భయం

2చూసినవారు
లేగదూడపై వీధి కుక్కల దాడి… రైతుల్లో భయం
యడ్లపాడు మండలంలో సోమవారం అర్ధరాత్రి చవిటి చెరువు సమీపంలో రైతు పోపూరి శివప్రసాద్‌కు చెందిన పాలుతాగే లేగదూడపై కుక్కల గుంపు దాడి చేసింది. పశువుల అరుపులు విని స్థానికులు చేరుకునే సరికి, కుక్కలు దూడను తీవ్రంగా గాయపరిచాయి. ముఖ్యంగా పొట్ట భాగంలో చర్మం పీకివేయడంతో దూడ ప్రాణాపాయ స్థితిలో ఉంది. సమాచారం అందుకున్న పశువైద్య అధికారులు అక్కడికి చేరుకుని చికిత్స అందించారు. ఇటీవల దూడపై దాడి ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకోవడంతో అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :