రేపు చిలకలూరిపేటలోని శారద హై స్కూల్లో జరగనున్న మెగా పేరెంట్స్ మీటింగ్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో, గురువారం సాయంత్రం ఏర్పాట్లను నాయకులు ఉత్సాహంగా పర్యవేక్షించారు. స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, నాయకులు మండలనేని చరణ్ తేజ, నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్ ఈ పర్యవేక్షణలో పాల్గొన్నారు.