Mar 15, 2026, 02:03 IST/
తిరుమల భక్తులకు TTD గుడ్ న్యూస్
Mar 15, 2026, 02:03 IST
AP: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు TTD గుడ్ న్యూస్ తెలిపింది. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని వసతి గృహాల్లో బస చేసే భక్తులకు అదనపు పడక సామాగ్రిని తక్కువ అద్దెకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దిండు, దుప్పటి, చాప, రగ్గులు వంటి వస్తువులను అద్దెకు తీసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఒక దుప్పటి రూ.10, రెండు దిండులు రూ.10, చాప రూ.10, రగ్గు రూ.20గా అద్దె నిర్ణయించారు. ప్రస్తుతం ఈ సేవలు నందకం అతిథి గృహంలో ప్రారంభించగా, త్వరలోనే ఇతర అతిథి గృహాలకు కూడా విస్తరించనున్నారు.