పేరాలలో ఘనంగా జ్వాలాతోరణం, లక్ష దీపోత్సవం

12చూసినవారు
చీరాలలోని పేరాలలో వేంచేసి ఉన్న శ్రీ మదన గోపాలస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి జ్వాలాతోరణ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అర్చక స్వాములు రావులకొల్లు వెంకట పరాంకుశం రంగాచార్య ఆధ్వర్యంలో మదన గోపాలునికి విశేష పూజలు జరిగాయి. అనంతరం భక్తులు కార్తీక దీపాలను వెలిగించి, ప్రసాద వితరణలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కూడా హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్