ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం: వేటపాలెం వాసవి క్లబ్ ఘన నివాళి

0చూసినవారు
బాపట్ల జిల్లా వేటపాలెం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన మహా పురుషుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా వాసవి క్లబ్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్