దుండి రాకేశ్‌పై దాడి అమానుషం దోగుపర్తి బాలకృష్ణ

4చూసినవారు
దుండి రాకేశ్‌పై దాడి అమానుషం దోగుపర్తి బాలకృష్ణ
రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేశ్‌పై జరిగిన దాడిని చీరాల తెలుగు యువత అధ్యక్షుడు దోగుపర్తి బాలకృష్ణ తీవ్రంగా ఖండించారు. గురువారం చీరాలలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సహజమే అయినా, వాటిని హింస ద్వారా వ్యక్తపరచడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో అసంతృప్తిని ఓటు ద్వారానే చూపాలని, భౌతిక దాడులకు దిగడం సరైన పద్ధతి కాదని బాలకృష్ణ అన్నారు. ఈ దాడి ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని ఆయన అభివర్ణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్