బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పాపాయిపాలెంలో రైతు భరోసా కేంద్రంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థులు రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొండయ్య, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా కేంద్రాల సేవలు, పంటల బీమా, పెట్టుబడి సాయం వంటి పథకాలు రైతులకు ఎలా అండగా ఉన్నాయో వివరించారు.