వేటపాలెంలో మహిళలకు అత్యవసర నంబర్లపై అవగాహన

0చూసినవారు
వేటపాలెంలో మహిళలకు అత్యవసర నంబర్లపై అవగాహన
చీరాల సబ్డివిజన్ శక్తి టీం ఆధ్వర్యంలో బుధవారం వేటపాలెంలోని జీడిపప్పు పరిశ్రమలో మహిళలకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శక్తి టీం సభ్యురాలు సీహెచ్ సునీత, శక్తి యాప్ వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, 112, 1098, 181, 1072 వంటి హెల్ప్‌లైన్ నంబర్ల ప్రాధాన్యత గురించి వివరించారు. ఆపరేషన్ దండాయన్, సైబర్ నేరాల నివారణపై కూడా అవగాహన కల్పించారు.