మహిళలకు సముద్రపు మొక్కల సాగు పై అవగాహన

6చూసినవారు
మహిళలకు సముద్రపు మొక్కల సాగు పై అవగాహన
చీరాల కొత్త ఓడరేవు ప్రాంతంలో మత్స్యకార మహిళల ఆర్థిక సాధికారత కోసం సీఎస్‌ఐఆర్ సేర్ప్-డిఆర్డిఏ ఆధ్వర్యంలో మంగళవారం సముద్రపు మొక్కల పెంపకంపై అవగాహన కార్యక్రమం జరిగింది. శాస్త్రవేత్త లక్కాకుల సతీష్ ఈ ప్రాంతం సాగుకు అనువైనదని తెలిపారు. ఎకో వేవ్ ఓసినిక్ ఎండి మాధవి ప్రకారం, తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం వస్తుంది, కిలో ధర రూ. 40-50 వరకు ఉంటుంది. ఈ మొక్కలకు ఔషధాలు, ఆహార ఉత్పత్తులు, సౌందర్య సాధనాలు, బయో ఎరువుల తయారీలో అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్