మహిళా టీచర్లకు ‘శక్తి యాప్’ పై అవగాహన సదస్సు

7చూసినవారు
మహిళా టీచర్లకు ‘శక్తి యాప్’ పై అవగాహన సదస్సు
బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.డి. మోయిన్ ఆధ్వర్యంలో గురువారం చీరాలలోని సెయింట్ ఆన్స్ స్కూల్‌లో మహిళా ఉపాధ్యాయులకు శక్తి యాప్ పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యురాలు సిహెచ్. సునీత పాల్గొని మహిళా రక్షణ, బాలల భద్రతపై కీలక అంశాలను వివరించారు. మహిళలు, యువతుల రక్షణ కొరకు ప్రభుత్వం శక్తి యాప్ తీసుకొచ్చిందని, దాని ప్రాధాన్యతను సునీత వివరించారు.

సంబంధిత పోస్ట్