కారు-లారీ ఢీ: నలుగురు మృతి, ఇద్దరు బాలుర క్షేమం

2చూసినవారు
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్యవతిపేట వద్ద కారు, లారీ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను బేతాళం బలరామరాజు (65), బేతాళం లక్ష్మి (60), గాదిరాజు పుష్పవతి (60), ముదుచారి శ్రీనివాసరాజు (54)గా గుర్తించారు. వీరితో పాటు ప్రయాణిస్తున్న ఇద్దరు బాలురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కుమారుడి సంగీత్ ఈవెంట్కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :