మొందా తుఫాన్ ప్రభావంతో చీరాలలోని వాడరేవు, రామాపురం, కటారిపాలెం, పొట్టి సుబ్బయ్య పాలెం బీచ్ లను అధికారులు తాత్కాలికంగా రెండు రోజులు పాటు మూసివేశారు. బీచ్ లలో గుంతలు, సుడిగుండాలు ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బీచ్ లకు వెళ్లే రహదారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యాటకులను అప్రమత్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి కార్తీక స్నానాలకు ఎవరూ రావద్దని రూరల్ సీఐ శేషగిరిరావు సూచించారు.