చీరాల పురపాలక సంఘం చైర్మన్ జంజనం శ్రీనివాసరావు శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ప్రజలకు స్వేచ్ఛ ఉండాలని ఉద్దేశంతో కృష్ణమోహన్ ను కరణం బలరాంతో కలిసి ఓడించడం జరిగిందని అన్నారు. మరల కాంగ్రెస్ నుండి పోటీ చేస్తే మరోసారి ఓడించామని తెలిపారు. చీరాలలో ఎన్నటికీ కృష్ణమోహన్ ను ఎమ్మెల్యే కానివ్వమని తెలిపారు.