చీరాల: కొత్త పాసు పుస్తకాలను అందజేసిన ఎమ్మెల్యే

12చూసినవారు
చీరాల: కొత్త పాసు పుస్తకాలను అందజేసిన ఎమ్మెల్యే
చీరాల పట్టణంలోని ఉజిలీ పేటలో శుక్రవారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రాజముద్ర పాసు పుస్తకాల పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే కొండయ్య ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు కొత్త పాసు పుస్తకాలను అందించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రీసర్వేలో 21.86 లక్షల పాసు పుస్తకాలు వెబ్ ల్యాండ్ వివరాలతో సహా ముద్రించబడ్డాయని ఆయన తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం రైతులను అపహాస్యం చేసిందని, జగన్మోహన్ రెడ్డి తన బొమ్మతో పాసు పుస్తకాలు ముద్రించారని ఎమ్మెల్యే కొండయ్య విమర్శించారు.

సంబంధిత పోస్ట్