చీరాల మండలం రామకృష్ణాపురం గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాన్ని గురువారం ఎమ్మెల్యే కొండయ్య పరిశీలించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని, అధైర్యపడవద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముంపు ప్రాంత ప్రజలకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లలోని నీటిని వెంటనే మోటర్లతో బయటకు పంపాలని సూచించారు.