చీరాల మండలం వాడరేవు సముద్ర తీర ప్రాంతాన్ని బుధవారం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ పరిశీలించారు. తీర ప్రాంతం కోతకు గురైనందున తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించి, యధావిధిగా స్థిరంగా ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులు, పర్యాటకులు కూడా అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.