చీరాల యువ నేత ప్రసాద్ రెడ్డికి వైసీపీలో కీలక పదవి

50చూసినవారు
చీరాల యువ నేత ప్రసాద్ రెడ్డికి వైసీపీలో కీలక పదవి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షునిగా చీరాలకు చెందిన కోడూరి ప్రసాద్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రసాద్ రెడ్డి భార్య నాగజ్యోతి చీరాల మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. తన పదవికి న్యాయం చేస్తానని ప్రసాద్ రెడ్డి చెప్పారు. తనకీ పదవి ఇచ్చిన జగన్, కరణం వెంకటేష్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్