చీరాల: ప్రజల సహకారంతోనే సంక్షేమ పథకాలు అమలు

50చూసినవారు
చీరాల: ప్రజల సహకారంతోనే సంక్షేమ పథకాలు అమలు
చీరాలలోని 7వ వార్డు నందు శుక్రవారం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొని ఇంటింటికి వెళ్లి ఏడాదిలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సహకారంతోనే సమర్థవంతంగా సంక్షేమ పథకాలు అమలు చేశామని అన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందని చెప్పారు.

సంబంధిత పోస్ట్