లారీ ఢీకొని దంపతులు మృతి, ఏడుగురిలో ఐదేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు

4చూసినవారు
చీరాల కారంచేడు రహదారిలో గ్యాస్ గోడం వద్ద శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. పర్చూరు నుండి చీరాల వస్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఉప్పుటూరు గ్రామానికి చెందిన సింగమ్మ (65) అక్కడికక్కడే మరణించగా, ఆమె భర్త రాఘవయ్య (75) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురిలో ఐదేళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్