వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దు ఎస్పీ

3చూసినవారు
వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దు ఎస్పీ
పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రవాణాలో తలెత్తిన స్వల్ప జాప్యం వల్ల కొన్ని బంకుల్లో తాత్కాలికంగా నిల్వలు తగ్గిన మాట వాస్తవమేనని, అయితే దీనిపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. త్వరలో పరిస్థితి చక్కబడుతుందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్