మహిళా రక్షణకు ‘శక్తి’ కవచం డీఎస్పీ మోయిన్

8చూసినవారు
మహిళా రక్షణకు ‘శక్తి’ కవచం డీఎస్పీ మోయిన్
మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని చీరాల డిఎస్పి ఎం. డి. మోయిన్ తెలిపారు. మంగళవారం వేటపాలెంలో జరిగిన ‘ఉమెన్ సేఫ్టీ మాదకద్రవ్యాల నిరోధం’పై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది మహిళలు, ఆశా వర్కర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు సాంకేతికతను ఉపయోగించుకోవాలని డిఎస్పి సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్