రైతన్నకు అండగా ప్రభుత్వం: చీరాలలో సంక్షేమ పథకాలపై అవగాహన

9చూసినవారు
బాపట్ల జిల్లా చీరాలలోని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఆదేశాల మేరకు బుధవారం 'రైతన్నా మీకోసం' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రైతులకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు. PACS ఛైర్మన్ కోటి మోహన్ కృష్ణ మాట్లాడుతూ, సేంద్రీయ పద్ధతుల్లో పంటలు పండించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్