ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో బుధవారం (05-11-2025) కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగనుంది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు. మంగళవారం సాయంత్రం బాపట్ల, నంద్యాల, బొల్లవరంలో గణనీయమైన వర్షపాతం నమోదైంది.