బాపట్ల జిల్లాలో భార్యాభర్తలు ఆత్మహత్య

7చూసినవారు
బాపట్ల జిల్లాలో భార్యాభర్తలు ఆత్మహత్య
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రావూరుపేటలో భార్యాభర్తలు బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నారు. మాజేటి ప్రభాకర్ (33), పార్వతి (24) అనే దంపతులు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. మృతురాలు పార్వతి తన 13 నెలల పాపను ప్రక్క ఇంటి వారికి అప్పగించినట్లు సమాచారం. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన ప్రభాకర్, అతని భార్య మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్