మంగళవారం చీరాల నియోజకవర్గ పరిధిలోని పందిళ్ళపల్లి సెంటర్ వద్ద జనసేన పార్టీ 'ఉద్యమి' సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. రాష్ట్ర బీసీ యువజన నాయకులు వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై స్థానిక ప్రజలు, యువత పెద్ద ఎత్తున సభ్యత్వాలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరు శివరాం ప్రసాద్, వేటపాలెం మండల అధ్యక్షులు డాక్టర్ ఉగ్గిరాల మార్కండేయులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.