తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు
ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు గురువారం చీరాల నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమాన్ని అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చీరాల నగరంలోని 2వ క్లస్టర్ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొని
ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహానాడు రాష్ట్ర అభివృద్ధికి నూతన వరవడి తెచ్చిందని ఆయన అన్నారు.